వారిపై చర్యలు తీసుకోరా : అసదుద్దీన్

రాజస్థాన్ లో గో రక్షకులు, పోలీసులు కలిసిపోయి దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. అల్వార్ లో గోరక్షకులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. మరణవాంగ్మూలంలో నిందితుడి పేరు ఉన్నా.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొన్నాళ్లుగా ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని.. కఠిన చర్యలు తీసుకుంటేనే అదుపులోకి వస్తాయన్నారు ఎంపీ అసదుద్దీన్.

Posted in Uncategorized

Latest Updates