వారేవా సూపర్ : దేశాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మట్టి బాటిల్స్

BOTTLE

ఎండాకాలంలో బయటకు వెళ్లాలి అంటే ఠక్కున గుర్తుకొచ్చేది వాటర్ బాటిల్. మండే ఎండ కావటంతో ఫ్రిజ్ లో కూల్ పెట్టుకుని వెళ్తాం. ప్లాస్టిక్, స్టీల్ ఇతర బాటిల్స్ వేడిని త్వరగా గ్రహించి.. నీటి చల్లదనాన్ని తగ్గించేస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మట్టి బాటిల్స్ వచ్చేశాయి. హైదరాబాద్ లో తయారు అవుతున్న ఈ బాటిల్స్ కు ఇప్పుడు గిరాకీ బాగుంది. కుండలను తయారు చేసే బంక మట్టితో వాటర్ బాటిల్స్ ను తయారు చేస్తున్నారు. వీటినిలో నీటిని పోస్తే.. ఎంతసేపు అయినా సరే చల్లగా ఉంటాయి. మట్టి బాటిల్స్ పై వివిధ రకాల డిజైన్స్ తో రంగు రంగుల్లో తీసుకురావటం వల్ల ఎంతో ఆకర్షనీయంగా ఉంటున్నాయి.

బంక మట్టితో తయారు చేస్తున్న ఈ బాటిల్స్ ని కూడా రంజన్స్ గా పిలుస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మట్టి కుండలతో పాటు ఈ రంజన్స్ సీసాలు అమ్ముతున్నారు. లీటర్, 2 లీటర్లు, 10, 15 లీటర్లలో వీటిని విక్రయిస్తున్నారు. ఒకటి, రెండు లీటర్ల మట్టి సీసాలకు డిమాండ్ చాలా ఉందని చెబుతున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి సీసాలపై డిజైన్స్ వేయటం వల్ల పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. వీటి బరువు కూడా చాలా తక్కువ. వీటిలో నీటి పోసిన 30 నిమిషాల్లో కూల్ గా తయారు అవుతాయని చెబుతున్నారు తయారీదారులు. కుండల కంటే ఎక్కువగా ఈ సీసాలకే డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు.

వీటి ధర రూ.150 నుంచి 200 రూపాయల వరకు ఉంది. వీటిని క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అని చెబుతున్నారు. కుండలను తయారు చేసే మట్టితోనే వీటిని తయారు చేస్తున్నామని.. దీని వల్ల మట్టిలోని ఔషధగుణాలు కూడా ఉంటాయన్నారు. మామూలు వాటర్ బాటిల్ లాగే ఉంటుందన్నారు. ఇవి పర్యావరణహితంగా కూడా అని చెబుతున్నారు. హైదరాబాద్ లో తయారు అవుతున్న మట్టి బాటిల్స్ దేశవ్యాప్తంగా విశేషంగా ఆకర్షించబడుతున్నాయి.

 

 

 

Posted in Uncategorized

Latest Updates