వార్నర్ లేకున్నా SRHకి ఆ సత్తా ఉంది : సాహా

SAHAIPL సీజన్-11 మరికొద్ది రోజులే ఉంది. ఈ క్రమంలో ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ గురించి మీడియాతో మాట్లాడాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా.  ఈ సీజన్‌ IPL కు వార్నర్  దూరమైనా తమ జట్టు రాణించగలదని చెప్పాడు సాహా. ఇక గత రెండు సీజన్ల నుంచి డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు  వహిస్తున్న విషయం తెలిసిందే. వార్నర్‌ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌ 2016లో IPL  టైటీల్‌ను గెలుచుకుంది. అయితే ఇటీవల ట్యాంపరింగ్‌ వివాదంతో ఈ స్టార్‌ క్రికెటర్‌ IPL భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా చర్యల తీసుకున్న తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని సన్‌రైజర్స్‌ మెంటార్‌ VVS లక్ష్మణ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సాహా మీడియాతో మాట్లాడుతూ.. కెప్టెన్‌ను దృష్టిలో పెట్టుకునే జట్టు సన్నాహకాలు ప్రారంభిస్తోందని.. అయితే అతనిక్కడ లేడన్నాడు. ఈ ప్రభావం మాజట్టుపై కొంత ఉంటుందని.. అతని స్థానం భర్తీ చేయగల ప్లేయర్లూ తమ జట్టులో ఉన్నారని తెలిపాడు. ఒక వేళ వార్నర్‌ ఉంటే అది తమకు అదనపు బలమని.. అతనో అద్భుత ఆటగాడు. గత సీజన్లలో హైదరాబాద్‌ కెప్టెన్ గా మంచి ప్రదర్శన కనబర్చాడని చెప్పాడు. అయినప్పటికీ అతని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లున్నారని.. తమ జట్టు రిజర్వ్‌ బెంచ్‌ చాలా బలంగా ఉందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు  సాహా.

Posted in Uncategorized

Latest Updates