వార్షిక రిపోర్ట్ రిలీజ్ చేసిన కేటీఆర్ : నష్టాల నుంచి లాభాల బాటలోకి HMDA

వార్షిక రిపోర్ట్ తో ప్రజలకు ఏది అవసరమో తెలుస్తుందని తెలిపారు మంత్రి కేటీఆర్. బుధవారం (జూలై-25) తెలంగాణలోని మున్సిపాలిటీ వార్షిక ప్రగతి నివేదిక విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోనే నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సంవత్సర కాలంలో నష్టాల నుంచి HMDA లాభాల బాటలోకి వచ్చిందన్నారు. సిటీలో ప్రతిరోజు చెత్తను తీస్తేనే క్లీన్ గా ఉంటుంది.

ఒక్కరోజు చేయకపోయిన కాల్స్ విఫరీతంగా వస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా క్లీన్ గా ఉంచడంలో సిబ్బంది హర్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింతగా పట్టణీకరణ జరుగుతుందని, ఉపాధి అవకాశాలు, విద్య, అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశం ప్రజలకు ఉండటంతోనే పట్టణీకరణ వేగంగా జరుగుతోందన్నారు. ఎకనమికల్ గా ఆలోచిస్తే తెలంగాణ GSDPలో 45 నుంచి 50 శాతం పట్టణాల నుంచే వస్తుందని తెలిపారు. పట్టణాభివృద్ధి ప్రణాళికబద్ధంగా జరగాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ర్టంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయన్నారు.

తెలంగాణలో 74 మున్సిపాలిటీలున్నాయని, త్వరలోనే 146 కానున్నాయని తెలిపారు. ఆస్తిపన్ను పెంచకుండానే 750కోట్ల నుంచి రూ. 1450కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. మునిసిపల్ బాండ్ల డబ్బులను రోడ్ల మరమ్మత్తులకు ఉపయోగించామని, కొల్లూరులో అతిపెద్ద డబుల్ బెడ్రూంల టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర రక్షణశాఖ సహకారం లేకనే రెండు పెద్ద స్కైవేలు ఆగిపోయాయని, హైదరాబాద్‌ రోడ్ల కోసం HRDCని, మూసీ ప్రక్షాళన కోసం మూసీ డెవలప్‌ మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామని తెలిపారు KTR. ప్రణాళిక పద్ధతిలేకపోతే మన నగరాలే మనకు శాపంలా మారే అవకాశం ఉందన్నారు.  2023 సంవత్సరానికి 50శాతం పాపులేషన్ పెరగనుందని..యాదాద్రి, భద్రాచలం, వేములవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీగా డెవలప్ అవుతాయన్నారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ లో మెట్రో సాధ్యంకాదన్న ఆరోపణల్ని తోసిపుచ్చుతూ..దేశంలోనే నెంబర్ వన్ గా మన మెట్రోకు గుర్తింపు వచ్చిందన్నారు మెట్రో ఎండీ. హైదరాబాద్ ను అంతర్జాతీయ వేదికగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సిటీకి మెట్రో తలమానికంగా తయారవుతోందన్నారు.

సమస్యలను ప్రజలతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ఈ వార్షిక రిపోర్ట్ ను విడుదల చేశారన్నారు GHMC కమిషనర్ జనార్దన్ రెడ్డి. 60 కోట్లతో హైదరాబాద్ లో LED లైట్లను అమర్చామని చెప్పారు. సిటీలో లైట్ వెలగడంలేదని ఫిర్యాదులు రాకుండా GHMC ఆప్ తీసుకొచ్చామన్నారు GHMC కమిషనర్. భవిష్యత్ కాలంలో దీన్ని మరింతగా ప్రజలకు అందుబాటులో ఉండేలా దృష్టి సారించామన్నారు GHMC కమిషనర్.

 

Posted in Uncategorized

Latest Updates