వాలెంటైన్స్ డే : హైదరాబాద్ లో పార్కులు బంద్

BUNDవాలంటైన్స్‌ డే సందర్భంగా బుధవారం (ఫిబ్రవరి-14) హైదరాబాద్‌లో పార్కులు మూసివేశారు. ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని భజరంగ్‌ దళ్‌ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భజరంగ్‌ దళ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ముందుజాగ్రత్తగా పార్కులను మూసివేశారు.

పార్కుల్లోకి వచ్చే జంటలపై దాడులు జరక్కుండా.. గొడవలు పడకుండా ఉండేందుకు పార్కుల మూసివేత నిర్ణయం తీసుకున్నది జీహెచ్ఎంసీ. మారువేశాల్లో షీ టీమ్స్‌ కూడా నిఘా పెట్టాయి. పార్కులు, హోటల్స్‌, పబ్బులు, బార్ల దగ్గర పోలీస్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. హుస్సేన్‌ సాగర్‌, నెక్లెస్‌ రోడ్డులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. లవ్ హైదరాబాద్ సింబల్ దగ్గర కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు. అయితే లవ్ హైదరాబాద్ దగ్గర రోజూ ఉండే సందడి కూడా ఇవాళ లేదు. ప్రేమికులు భయపడి ఆ వైపు వెళ్లటం లేదు.

Posted in Uncategorized

Latest Updates