వాళ్లకి పూనకం వచ్చింది : టీ 20 ఉమెన్స్ క్రికెట్ లో.. ఇంగ్లండ్ వాల్డ్ రికార్డ్

MAHIమొన్న ఇంగ్లండ్ మెన్స్ టీమ్ అదరగొడితే.. ఇవాళ మహిళల టీమ్ ఇరగదీసింది. వన్డేల్లో ఇంగ్లండ్ పురుషుల జట్టు అత్యధిక స్కోర్ చేస్తే.. ఇంగ్లాండ్  మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక స్కోరు చేసింది. టాస్  గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఏకంగా 3 వికెట్ల నష్టానికి  250 రన్స్ చేసింది. ఓపెనర్ బీమాంట్ 52 బాల్స్ లో 116 రన్స్ చేసింది. మరో ఓపెనర్ వ్యాట్ 56 పరుగుల చేసింది.

ఆ తర్వాత క్రీజలోకి వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమెన్లు ఏ ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ వాన్  నీకెర్క్  72 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో 121 పరుగుల తేడాతో ఇంగ్లాండ్  మహిళల టీమ్ ఘన విజయం సాధించింది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెట్ జట్లు రికార్డులపై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఓ మహిళా జట్టు టీ 20 మ్యాచ్ లో.. అదీ మరో అంతర్జాతీయ జట్టుపై 250 పరుగులు చేయటం సామాన్యమైన విషయం కాదు. 52 బంతుల్లోనే 116 రన్స్ చేసి.. బీమాంట్ కూడా రికార్డ్ క్రికెట్ చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది..

Posted in Uncategorized

Latest Updates