వాళ్లకు రౌడీలుంటే.. మాకు మోడీ ఉన్నాడు.. రామ్ మాధవ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర పార్టీ లీడర్లు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.

టీఆర్ఎస్ దగ్గర డబ్బు, రౌడీలు ఉన్నారు. కానీ బీజేపీ దగ్గర మోడీ ఉన్నారు. అదే ఎన్నికల్లో సమాధానం చెబుతుందని అన్నారు రామ్ మాధవ్. “మార్పు సికింద్రాబాద్ నుంచి మొదలు కాబోతోంది. కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిపిస్తే జనాల్ని మోసం చేశారు. నగరంలో గుంతలు లేని రోడ్లు చూపిస్తే పదివేలు ఇస్తామని మాట తప్పారు. మజ్లిస్ కు దాసోహమై పరిపాలన సాగించారు” అని లక్ష్మణ్ అన్నారు.

“దేశంలో నాలుగేళ్లుగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత యోగ్యత కలిగిన పార్టీ బీజేపీనే. జనం టీఆర్ఎస్ కు మెజారిటీ ఇస్తే ఐదేళ్లు పాలించకుండా జెండా ఎత్తేశారు.

మోడీ ధాటికి తట్టుకోలేకే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తెలుగు దేశం కాదు.. తెలుగు ద్రోహం పార్టీ…  కాంగ్రెస్ తో జత కడుతోంది. కుటుంబ పాలన, మత తత్వం లేని పార్టీలను కలుపుకొని వెళదాం. కొందరు తటస్థులు మంచి ఉద్దేశంతో పార్టీలు పెట్టారు. వారిని కలుపు కోవాలి” అని రామ్ మాధవ్ అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates