వాళ్లను చంపినా పాపం లేదు : తిండి పెట్టకుండా.. 8 రోజులపాటు చిన్నారిపై రేప్, హత్య

asifజమ్ముకశ్మీర్‌ లోని కతువా జిల్లాలో 2018 జనవరి 10వ తేదీన తన ఇంటి దగ్గర్లోని గుర్రాలకు మేత వేస్తున్న సమయంలో అసిఫా(8) అనే బాలికను ఎనిమిది మంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓ చిన్న గ్రామంలో దాచారు. వారం రోజులు తిండిపెట్టలేదు. అంతేకాదు.. ఆ చిన్నారిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారి రాయితో కొట్టి చంపారు. చిన్నారి ఆసిఫా రేప్, హత్యలో ఉన్నది ఎవరో తెలుసా.. పోలీస్ అధికారులు, ఒక రిటైర్డ్ రెవిన్యూ డిపార్ట్ మెంట్ అధికారి.

పోలీసులు కోర్టులో అందజేసిన ఛార్జిషీట్ చూస్తే రక్తం మరుగుతోంది. చిన్నారిని తలపై రాయితో కొట్టి చంపే సమయంలో.. ఈ కిరాతకంలో పాలుపంచుకున్న ఓ పోలీస్ అధికారి.. చిన్నారిపై మరోసారి అత్యాచారం చేయటానిక అనుమతి ఇవ్వాలని కోరాడు. ఎంత దుర్మార్గుడు వీడు. ఎనిమిది రోజులుగా ఆహారం లేక.. వరస అత్యాచారాలతో అప్పటికే జీవచ్ఛవంగా మారిన చిన్నారిపై మళ్లీ అత్యాచారం చేయాలన్న వాడి ఆలోచన చూస్తుంటే.. వాడు మనిషిగా ఈ భూమ్మీద ఉండటానికే అనర్హుడు అంటున్నారు.

మైనారిటీలుగా ఉన్న బఖర్‌ వాల్ సంచార జాతివారిని వెళ్లగొట్టేందుకు.. కతువా జిల్లాలోని ఓ ఆలయ సంరక్షకుని ఆధ్వర్యంలో కొందరు  క్రూరమైన దారుణాలకు ఒడిగట్టారని, ఇందులో అసిఫా ఒకరని పోలీసులు తమ చార్జిషీట్ లో తెలిపారు. జనవరి 17న అడవుల్లో ముక్కలు ముక్కలుగా ఉన్న చిన్నారి మృతదేహం లభించిందని తెలిపారు పోలీసులు. చిన్నారి మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి వీల్లేదని, ఇది హిందువుల ఫ్లేస్ అని చిన్నారి దహనసంస్కారాలు అడ్డుకున్నారని తెలిపారు. బఖర్ వాల్ సంచార జాతి వారు హిందూ-ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్న ముస్లిం కుటుంబాల చిన్న సమూహం. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిందితులను ఉరి తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఇది మానవత్వాన్ని వ్యతిరేకమైన చర్య అన్నారు. అలాంటి దుర్మార్గపు నిందితులను ఎవరైనా కాపాడాలని ఎట్లా భావిస్తారంటూ పరోక్షంగా మెహబూబా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై పలువులు కేంద్రమంత్రులు కూడా స్పందించారు. నిందితులను వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates