వాళ్లవి ఎవరూ చూడ్డం లేదంట : పాక్ లో భారత సినిమాలు నిషేధం

CINEMAసినిమా బాగుంటే అది ఏ దేశం వాళ్లయినా ఎగబడి చూస్తారు.. అదే బాగోలేదంటే మనోళ్లదే అయినా ఎవరూ చూడరు. అంతెందుకు అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే ఫ్యాన్స్ కూడా థియేటర్లలో కనిపించరు. ఇది కామన్. అలాంటిది పాకిస్తాన్ లో డిఫరెంట్. భారత సినిమాల దెబ్బకు.. పాక్ మూవీస్ ఆడటం లేదంట. ముఖ్యంగా రంజాన్ సీజన్ లో వచ్చే పాక్ సినిమాలకే.. అక్కడే ధియేటర్లు దొరకటం లేదంట. దీంతో పాక్ నిర్మాత, దర్శకులు, హీరోలు ఓ నిర్ణయం తీసుకున్నారు. బాగున్నా.. బాగోలేకపోయినా రంజాన్ సీజన్ లో పాకిస్తాన్ సినిమాలు మాత్రమే చూడాలనే నిబంధన విధించారు. అందుకు తగ్గట్టుగా రంజాన్ సీజన్ తోపాటు.. సెలవులు అయిపోయిన రెండు వారాలు పాక్ లో భారత సినిమాలపై నిషేధం విధించారు.

రంజాన్ సందర్భంగా సరిహద్దులో కాల్పుల విరమణను భారత్ ప్రకటిస్తే… పాక్ మాత్రం భారత్ సినిమాలపై నిషేధం విధించి మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఈద్ కు రెండు రోజుల ముందు నుంచి సెలవులు అయిపోయిన తర్వాత మరో రెండు వారాలపాటు నిషేధం కొనసాగుతుందని తెలిపింది పాకిస్థాన్ సర్కార్. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజ సమయంలో భారత్ సహా విదేశాలకు చెందిన ఏ సినిమాను ప్రదర్శించకూడదని నోటీసులు జారీ చేసింది పాక్. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల కారణంగా థియేటర్లు దొరకటం లేదని పాక్ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటం వల్ల .. ఈనిర్ణయం తీసుకుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates