వాళ్ల కంట్లో పడ్డామా : బైక్ పై కనిపిస్తే చాలు.. పెళ్లి చేసేస్తున్నారు

bike

వారి వయస్సు 20 ఏళ్లు.. చదువుకుంటున్నారు.. ఫ్రెండ్స్ కూడా.. ఇద్దరూ సరదాగా బైక్ పై షికారు కూడా చేస్తుంటారు.. అనుకోకుండా ఓ రోజు వారికి ఓ గుంపు ఎదురొచ్చింది.. బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేశారు.. కలలో కూడా ఊహించని ఈ ఘటనతో వారు షాక్ అయ్యారు. అసోంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అస్సాం రాష్ట్రం పుకుర్ పూర్ గ్రామం. సమీపంలోనే రోంగ్ జులి ఏరియాలో చెరువు, పార్క్ ఉంటుంది. అక్కడికి పెద్ద ఎత్తున యువతీ యువకులతోపాటు, పర్యాటకులు కూడా వస్తుంటారు. జూన్ 19వ తేదీన ఓ యువ జంట బైక్ పై అటుగా వచ్చారు. సరదాగా చక్కర్లు కొడుతున్నారు. వారికి ఓ గుంపు ఎదురుపడింది. 10 మంది యువకులు ఉన్నారు. బైక్ తో సహా ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఈ వయస్సులో ఒకరిపై ఒకరు చెయ్యి వేసుకుని తిరగడానికి మీకెంత ధైర్యం అంటూ కొట్టారు. మీ లాంటి వాళ్ల వల్లే.. మన సంప్రదాయాలు నాశనం అవుతున్నాయంటూ తిట్టారు. ఆందోళనకారులకు ఆ జంట నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. లవర్స్ కాదని,  ఫ్రెండ్స్ అని ఎంత చెప్పిన వినలేదు. ఇలా వదిలేస్తూ రోజూ తిరుగుతారు మీరు.. అంటూ ఆ అబ్బాయి చేత.. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించారు. తాళి కట్టే వరకు నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత వదిలేశారు. ఈ వ్యవహారాన్ని ఫొటోలు తీశారు కొందరు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వీడియో, ఫొటోలు వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కులదర్ సైకియా తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై IPC సెక్షన్-342, 325,354b కింద కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పుడే కాదని.. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇలా తిరుగుతున్న కొన్ని జంటలకు కూడా పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి విషయం బయటపడితే పేరంట్స్ నుంచి భయపడి బయటకు చెప్పుకోలేదని యువత అంటోంది. భారతీయ సంస్క్రుతి, సంప్రదాయం పేరుతో కొన్ని అల్లరి మూకలు ఇలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates