వాళ్ల పెళ్లి వాళ్లిష్టం : మేజర్ల పెళ్లిపై సుప్రీం సంచలన తీర్పు

inter-caste-marriage-indiaవయసొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. పెళ్లికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మొన్నటి వరకు పెళ్లికి కులాలు, మతాలు అడ్డు అని, పెద్దల అంగీకారంతోనే పెళ్లిల్లు జరగాలంటూ చాలా కండీషన్లు ఉండేవి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెద్దలు తమకు నచ్చినప్పుడే, నచ్చిన వ్యక్తితో తమ పిల్లలకు పెళ్లిల్లు చేసే పద్ధతికి సుప్రీం కోర్టు న్యాయస్థానం చెక్ పెట్టేసింది. పెళ్లీడు వయసొచ్చిన ప్రతి అమ్మాయి, అబ్బాయి వారి వారికి నచ్చిన ఏ వ్యక్తినైనా పెళ్లిచేసుకునే అవకాశం ఉందని, ఈ విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పునిచ్చారు.
ఇటీవలే 23 ఏళ్ల హిందు అబ్బాయి.. వెస్ట్ ఢిల్లీలో ముస్లిం ప్రేయసి బంధువులు దాడిచేసి, చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై హర్యానాలోని శక్తివాహిని అనే సంస్థ, కాపు పంచాయత్ గ్రూపు  కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు వేసారు. ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. కులాలు, మతాలు అనేవి పరిగణలోకి తీసుకోవడం లేదని.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల నిర్ణయమని వ్యాఖ్యానించింది. అందులో మంచి, చెడు గురించి మాత్రం సూచనలు ఇవ్వాలిగానీ.. ఎలాంటి జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతోనైనా పరువు హత్యలు ఆగుతాయో లేదో చూడాలి.

Posted in Uncategorized

Latest Updates