వావ్..! మొబైల్ ఎయిర్ బ్యాగ్.. ఫోన్ కిందపడ్డా పగలదు

ఎయిర్ బ్యాగ్ అనగానే కార్లలో ఉండేవి గుర్తొస్తాయి. యాక్సిడెంట్ టైమ్ లో వాహనంలో ఉండేవాళ్ల ప్రాణాలను సేవ్ చేస్తుంటాయి ఎయిర్ బ్యాగ్స్. అలాగే… ‘మొబైల్ ఎయిర్ బ్యాగ్’ కూడా పనిచేస్తుందనుకోవచ్చు. ఐతే.. ఇందులో తెరుచుకునేవి ఎయిర్ బ్యాగులు కాదు… ప్రత్యేకంగా అమర్చిన ప్లాస్టిక్ లెగ్స్. ఫోన్ పాడైపోకుండా కాపాడుతుంది కాబట్టి అలా పేరు పెట్టేసారు. నేలపై పడిపోవడంతో చాలామంది ఫోన్లు, స్క్రీన్లు పగిలిపోవడం కామన్. అలా ఇబ్బందిపడ్డ వారికి ఈ మొబైల్ ఎయిర్ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుందనుకోవచ్చు. కొనడం సంగతి తర్వాత. ముందు అది ఎలా పనిచేస్తుందో ఓసారి చూద్దాం.

ఫిలిప్ ఫ్రెంజెల్. జెర్మనీలోని ఆలెన్ నగరానికి చెందిన ఓ ఔత్సాహిక్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఇతను. తనకున్న తెలివితేటలతో.. మొబైల్ కిందపడినా దానిని కాపాడే ఓ పరికరాన్ని కనిపెట్టాడు. ఫోన్ కు కొంత స్పేస్ తో బ్యాక్ ఫ్రేమ్ ను అమర్చి.. గాలి నిర్ణీత వేగంతో అందులోకి వెళ్లిప్పుడు దాన్నుంచి నాలుగు వైపులా  పాదాలు వంపు తిరిగి బయటకు వస్తాయి. ఫోన్ ఏ వైపునుంచి డ్రాప్ అయినా.. దానిని నేలపై పడకుండా అడ్డుకుంటాయి. దీనికి అతడు చేసిన కసరత్తు మామూలుది కాదు. రెండేళ్లపాటు కష్టపడి ఈ డివైజ్ ను కనిపెట్టాడట. మెకానాట్రిక్స్ లో అతడి క్రియేటివిటీని చూసి.. ఓ జెర్మన్ సొసైటీ అతడిని అవార్డ్ ఇచ్చి గౌరవించింది కూడా. ఆ మొబైల్ ఎయిర్ బ్యాగ్ పరికరం ఎలా పనిచేస్తుందో ఓసారి మీరే చూడండి.

 

Posted in Uncategorized

Latest Updates