వాహనదారులకు షాకింగ్ న్యూస్ : జరిమానాలు లేవు.. జైలుకి వెళ్లటమే

jailఫ్రెండ్ పార్టీకి పిలిచాడు.. వెళ్లండి బండి లేకుండా. ఫ్రెండ్ బండి అడిగాడా.. ఇవ్వండి.. కానీ మీరు జైలుకి వెళ్లొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీశారు.. జైలుకి వెళ్లటానికి సిద్ధం అవ్వండి.. పిల్లలు ముచ్చట పడితే బండి ఇచ్చారా.. అయితే ఆ పేరంట్స్ జైలుకి వెళ్లాల్సిందే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్, కారు డ్రైవింగ్ చేస్తున్నా.. దర్బాగా చేయండి.. కాకపోతే ఆ తర్వాత జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.. అసలు మీరు బండి తీసుకుని రోడ్డెక్కితే తిన్నగా పోవాల్సిందే.. ఏ మాత్రం రూల్స్ బ్రేక్ చేసినా.. పోకిరీ వేషాలు వేసినా నేరుగా జైలుకి వెళ్లాల్సిందే.. రోడ్లు బాగోలేదు.. నా తప్పు లేదు.. కొంచెమే కదా.. ట్రాఫిక్ లేదు కదా ఇలాంటి సాకులు చెప్పినా వినరు. ఫైన్ (జరిమానా)తో బయటపడదాం అంటే అస్సలు కుదరదు. జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు దొరికితే.. కౌంట్ తక్కువగా వచ్చింది.. జరిమానా కట్టి బయటపడొచ్చు అనే ఫీలింగ్ వదిలిపెట్టండి. ఇక నుంచి ఆల్కాహాల్ రీడింగ్ 35 వచ్చినా జైలు శిక్ష తప్పదంటున్నారు పోలీసులు. అది మొదటిసారి అయినా జైలుకి వెళ్లాల్సిందే అంట. డ్రంక్ అండ్ డ్రై రెగ్యులర్ గా నిర్వహిస్తూ మార్పు రాకపోవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి అని.. కౌంట్ తక్కువ అని తేడా ఏమీ లేకుండా అందరికీ జైలు శిక్షలు వేసే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. బార్ కు వెళ్లాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గుర్తుకురావాలి.. మందు కొట్టి రోడ్డెక్కాలంటే జైలు గుర్తుకు రావాలి అన్నంతగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక్క బీరు కొట్టినా.. కల్లు కదా అని ఒక్క గ్లాసు తాగినా.. 30ఎం.ఎల్ కదా అని స్మాల్ పెగ్గు వేసినా.. రీడింగ్ మాత్రం అమాంతం లేస్తుంది.. మీరు వెళ్లి జైల్లో కూర్చుంటారు.

ఇక పిల్లలకు వాహనాలు ఇచ్చే పేరంట్స్ కూడా చిప్పకూడు తినక తప్పదు. మార్చి, ఏప్రిల్ (గత రెండు నెలల్లోనే) 26 మంది పేరంట్స్ ఇలా జైలుకి వెళ్లారు. దీనికి కారణం లేకపోలేదు. 2016లో 18ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసులు 2వేల 722గా ఉంటే.. అది 2017లో 3వేల651 కేసులుగా ఉన్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్న ఈ కేసులను పరిగణలోకి తీసుకుని.. పేరంట్స్ కు జైలు శిక్ష విధిస్తున్నారు.

వాహనదారులు బీ కేర్ ఫుల్. బండి తీసి రొడ్డెక్కేటప్పడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జైలుకి వెళ్లాల్సిందే..

Posted in Uncategorized

Latest Updates