విండీస్ కోచ్ పై రెండు వన్డేల నిషేదం

విండీస్ కోచ్ స్టువర్ట్ లా పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) నిషేదం విధించింది.  హైదరాబాద్ లో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రూల్స్ అతిక్రమించినందుకు ఆయన పై రెండు వన్డేల నిషేదంతో పాటు 100 శాతం జరిమానా విధించింది. భారత్ తో జరిగిన రెండో టెస్ట్ లో విండీస్ ప్లేయర్ కీరన్ పావెల్ ఔటైన వెంటనే స్టువర్ట్ లా టీవీ అంపైర్ రూంలోకి వెళ్లి గొడవపడ్డాడు. తర్వాత నాలుగో అంపైర్‌ దగ్గరకు  వెళ్లి ప్లేయర్స్ ముందే ఇబ్బందికరంగా మాట్లాడటంతో  అంపైర్ ఆయన పై రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ICC మ్యాచ్ రిఫరీ ప్యానల్ సభ్యుడు క్రిస్ బ్రాడ్ విండీస్ కోచ్ పై నిషేధం విధించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates