విండీస్ తొలి ఇన్నింగ్స్ 311 ఆలౌట్.. మళ్లీ మెరిసిన పృథ్వీ షా

ఉప్పల్ : హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి(రెండో) టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. రెండోరోజు 295/7 స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ కొద్దిసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. 98 రన్స్ తో బ్యాటింగ్ కొనసాగించిన ఆర్ఎల్ చేజ్ సెంచరీ పూర్తిచేశాడు. 106 రన్స్ చేసిన చేజ్ … ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెస్టిండీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ పతనాన్ని ఉమేష్ యాదవ్ శాసించాడు. ఉమేష్ మొత్తం ఆరు వికెట్లు తీసుకుంటే… కులదీప్ యాదవ్ మూడు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మొదట్లోనే కేెల్ రాహుల్(4) వికెట్ కోల్పోయింది. ఐతే.. మరో ఎండ్ లో పృథ్వీ షా తన ఫామ్ కొనసాగించాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన పృథ్వీషా.. రెండో టెస్టులోనే చెలరేగి ఆడాడు. టీట్వంటీ, వన్డే స్టైల్లో వేగంగా ఆడిన పృథ్వీ షా.. 39 బంతుల్లోనే.. 1 సిక్సర్, 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. లంచ్ విరామానికి ఇండియా స్కోరు 16 ఓవర్లలో 80/1. పుజారా 9 పరుగులతో షా కు తోడుగా క్రీజులో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates