వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత కెర్బర్

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌గా జర్మనీకి చెందిన వరల్డ్ నెంబర్‌ 10 అంజెలిక్‌ కెర్బర్‌ నిలించింది. శనివారం(జూలై-14) జరిగిన ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌ను 6-3,6-3 తేడాతో ఓడించి టైటిల్‌ను ఫస్ట్ టైం దక్కించుకుంది.

మ్యాచ్ ప్రారంభం  నుంచే కెర్బర్‌ దూకుడుగా ఆడుతూ ఆధిక్యంలో కొనసాగింది. సెరీనా మ్యాచ్‌లో 14 తప్పిదాలు చేసి కెర్బర్‌కు అవకాశ మిచ్చింది. కాగా కెర్బర్‌ నాలుగు సార్లు బ్రేక్‌ పాయింట్లను సాధించగా, సెరీనా ఒకసారి మాత్రమే బ్రేక్‌ పాయింట్‌ను సాధించింది. కెర్బర్‌ మొదటి సెట్లో 5-3తో ఆధిక్యంలోకి దూసుకుపోయి తర్వాత మరో పాయింట్‌ను సాధించి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో కూడా కెర్బర్‌ అదే దూకుడును ప్రదర్శించింది. 6-3 తేడాతో రెండో సెట్‌ను మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కెర్బర్‌ కిది మూ డో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను, US ఓపెన్‌ ను గెలుచుకున్న కెర్బర్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ ను గెలిచి మూడో గ్రాం డ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates