వింబుల్డన్ లో అర్హత సాధించిన తెలంగాణ ప్లేయర్స్

wimbldon
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాడు తెలంగాణకు చెందిన టెన్నిస్ ప్లేయర్ జే విష్ణువర్దన్. డబుల్స్‌లో బాలాజీతో జత కట్టిన విష్ణు వర్ధన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జిలేనీ-మోల్చనోవ్ జంటపై గెలుపొందారు.. విష్ణు-బాలాజీ జోడి డబుల్స్ ర్యాంకింగ్‌లో వంద లోపు ర్యాంక్ సాధించారు.  దీంతో మెన్స్ డబుల్స్ మెయిన్ డ్రాకు విష్ణు జంట ఎంపికైంది. సీవీ నాగరాజ్ వద్ద విష్ణు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మైత్రా ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం విష్ణుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మహేశ్ భూపతి, రోహన్ బొప్పన్నాలు తమ మ్యాచ్‌లు చూస్తున్నారని, సలహాలు కూడా ఇస్తున్నారని చెప్పాడు విష్ణు. ఈ ఏడాది వింబుల్డన్ కంటే ముందుగా జర్మనీ, లండన్‌లో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్‌లను ఆడడం వల్ల ఉపయోగం జరిగిందన్నాడు విష్ణు. గ్రాస్‌ కోర్టులో ఎలా ఆడాలన్న అనుభవం వచ్చిందన్నాడు. చైనాలో జరిగిన చాలెంజర్ సిరీస్‌లో ఓడినా…తమకు కావల్సినంత అనుభవం లభించిందంటున్నాడు విష్ణు.

Posted in Uncategorized

Latest Updates