వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ ట్రాన్స్ ఫర్

వికారాబాద్‌ SP టి.అన్నపూర్ణను ఎలక్షన్‌ కమిషన్‌ బదిలీ చేసింది. అన్నపూర్ణ స్థానంలో 2005  IPS బ్యాచ్‌కు చెందిన అవినాశ్‌ మొహంతిని నియమించింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కమిషన్‌  తెలిపింది. అన్నపూర్ణను పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేయాలని, ఎన్నికల విధులకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది.

మంగళవారం అర్ధరాత్రి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. కొడంగల్‌లోని రేవంత్‌ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు చొరబడి అరెస్ట్‌ చేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ఢిల్లీ స్థాయి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని… రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. దీనిపై నివేదిక తెప్పించుకున్న ఈసీ.. చర్యలు చేపట్టింది. అరెస్ట్ అయిన రేవంత్ ను విడుదల చేయాలని సీఈఓ రజత్ కుమార్ మంగళవారం సాయంత్రం పోలీసులకు సూచించారు. బుధవారం రోజున వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు అందాయి.

Posted in Uncategorized

Latest Updates