విజయం మనదే: మనం అనుకున్నట్లే ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యుల్ పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబరులో ఎన్నికలు జరగడం తమకు సానుకూలమని ఆయన అన్నట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యుల్ వెలువడిన తర్వాత కేసీఆర్ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు.

ముందుగా అభ్యర్ధు లను ప్రకటించుకోవడంతో క్షేత్రస్థాయిలో మీ పరిస్థితి ఏంటో మీకు తెలిసిందన్నారు. ఇక ఎన్నికల తేదీ లొచ్చేశాయి… ప్రతిపక్షం ఇంకా సన్నద్దమే కాలేదని.. మనం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల అభిమానాన్ని పోలింగ్‌బూత్‌ వరకు తీసుకెళ్ళేలా వ్యూహరచన చేయాలని సూచించారు. ఈ రెండు నెలలు ఎంతో కీలకమని… ప్రతి క్షణం సద్వినియోగం చేసుకుంటూ చాలా కష్టపడాలని నేతలతకు చెప్పారు. ప్రజలకు మనపట్ల విశ్వాసం ఉంది… ఏం చేసినా కేసీఆర్‌, టీఆర్ఎస్  మాత్రమే చేయగలరన్న నమ్మకం ఉంది. అభివృద్దిని, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు తీస్కెళ్లాలని తెలిపారు. కూటమి కుట్రలను వివరించాలన్నారు. ఎన్నికల తేదీలు ఊహించినట్లుగానే అటుఇటుగా వచ్చాయని, ఇప్పటివరకు అన్నీ లెక్కప్రకారం.. అనుకున్నట్లు జరుగుతున్నాయని, ఫలితాల విషయంలోనూ సెంచరీ కొట్టబోతున్నామని కేసీఆర్‌ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల్లో అభిమానం ఉండడం కాదు.. ఆ అభిమానాన్ని ఓట్లరూపంలో మలుచుకుని ఓట్లు వేయించుకు నేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపపడటంతో పాటు.. ప్రచారంలోనూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విమర్శలను ఎప్పటి కపుడు తిప్పికొడుతూ అభివృద్దిని వివరించండి అని కేసీఆర్‌ అభ్యర్ధులకు సూచించినట్లు సమా చారం.

ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్నందున దీనికి అనుగుణంగా టీఆర్ఎస్ కార్యాచరణ ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 105 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 14 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఈ నెల 9 తర్వాత ప్రకటించనున్నట్లు తెలిసింది.

Posted in Uncategorized

Latest Updates