విజయవాడకి సీఎం : దుర్గమ్మ మొక్కు చెల్లించనున్న కేసీఆర్

kcr-vijawadaసీఎం కేసీఆర్ ఏపీ రాష్ట్రం విజయవాడ దర్శించుకోనున్నారు. షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. జూన్ 28వ తేదీ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్టం వస్తే అమ్మవారికి బంగారు ముక్కు పుడుక చేయిస్తానని మొక్కుకున్నారు. నాలుగేళ్లు అయ్యింది రాష్ట్రం వచ్చి. ఇప్పటికే తిరుమల వేంకటేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మకు కూడా మొక్కు చెల్లించుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates