విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజీనామా..

ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం

విజయవాడ: జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామా ను ప్రభుత్వం ఆమోదించింది. సిద్ధార్థ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫెసర్ శివ శంకర్ రావు కు ఇంచార్జి గా బాధ్యతలు అప్పగించారు. నాంచారయ్య పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే కొన్ని గంటల ముందు నాంచారయ్య తన పదవికి రాజీనామా చేశారు. గతంలోనూ నాంచారయ్య పై ఆసుపత్రి సిబ్బంది,వైద్యులు నుంచి ఫిర్యాదులు వెల్లువత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు. కేసు అత్యంత సున్నితం.. వివాదాస్పదం కావడంతో విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  ఈ నేపధ్యంలో సూపరింటెండెంట్ నాంచారయ్య పదవి నుండి తప్పుకుంటున్నట్లు రాజీనామా ఉన్నతాధికారులకు పంపారు. వైద్య శాఖ ఉన్నతాధికారుల సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన రాజీనామా పై  ఆమోదం తెలిపింది.

 

Latest Updates