విజయవాడ దుర్గ గుడిలో కిడ్నాప్ కలకలం…ఐదేళ్ల చిన్నారి అదృశ్యం

vizaవిజయవాడ  కనక దుర్గగుడిలో ఆదివారం(జూన్-17) ఉదయం ఐదేళ్ల చిన్నారి నవ్యశ్రీ అదృశ్యమవడం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన పైడి రాజు, శ్రీదేవిల కుమార్తె నవ్యశ్రీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆలయంలో అదృశ్యమైంది. ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ పుటేజి ఆధారంగా 8 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చిన్నారిని తీసుకెళ్లిన వారు కూడా గుడికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Posted in Uncategorized

Latest Updates