విజయ్ కాంత్ కి అమెరికాలో సర్జరీ

vijayakanthకోలీవుడ్ సీనియర్ హీరో విజయ్ కాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే పలుసార్లు సర్జరీలు చేయించుకున్నారు. అప్పట్నుంచీ అనారోగ్యానికి గురైన విజయ్ కాంత్.. DMDK  పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. మళ్లీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో.. సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నట్లు గురువారం (జూలై-5) ట్విట్టర్‌ ద్వారా తెలిపారు విజయ్ కాంత్.  జూలై 7వ తేదీన వెళ్తున్నానని, వీడ్కోలు చెప్పేందుకు ఎయిర్‌ పోర్టుకు రావొద్దని అభిమానులను కోరుతూ ట్విట్ చేశారు విజయ్ కాంత్.

Posted in Uncategorized

Latest Updates