విజయ్ ట్వీట్ : A సర్టిఫికేట్‌ అనుకుంటే..U వచ్చింది

ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ -5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు క్లీన్ యూ  సర్టిఫికెట్ పొందింది. విజయ్ సరసన మెహ్రీన్  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాణంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ లో సంతోషాన్ని పంచుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ.  తెలుగు వర్షెన్‌ కు సంబంధించిన సెన్సార్‌ సభ్యులు ఏ సర్టిఫికేట్‌ ఇస్తారో అంటూ సెటైరికల్‌ కామెంట్‌  చేశాడు విజయ్‌.

తమిళ్‌లో A సర్టిఫికేట్‌ అనుకుంటే..U వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికేట్‌ ఇస్తుందో చూడాలి అంటూ ట్వీట్‌ చేశాడు.  ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సినిమా యూనిట్.. సెప్టెంబర్‌ 30న విజయవాడలో, అక్టోబర్‌ 1న హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates