విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం

యంగ్ హీరో విజయ్ దేవరకొండ… అప్ కమింగ్ సినిమా “డియర్ కామ్రేడ్” షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. టాక్సీ వాలా సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాకినాడ రైల్వే స్టేషన్ లో ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ ను తీస్తున్నారు. ఆదివారం షూటింగ్ స్పాట్ లో విజయ్ కు కు పెను ప్రమాదం తప్పింది.

సీన్ లో భాగంగా… వేగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీపైనుంచి దిగొచ్చి… కదులుతున్న రైలును ఎక్కాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ కూడా అలాగే… మెట్లు దిగొచ్చి.. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఐతే… ట్రైన్ ఎక్కుతున్న టైమ్ లో పట్టు తప్పి పడిపోయాడు. వెంటనే షూటింగ్ సిబ్బంది అతడికి సహాయం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తన చేతికి తగిలిన గాయాన్ని ఇన్ స్టగ్రామ్ లో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి… జీవితంలో ఏదీ అంత ఈజీగా దక్కదు’ అని కామెంట్ పెట్టాడు. దీంతో… చాలామంది ఫ్యాన్స్ వర్రీ అయిపోయారు. తుపాను, వర్షం కారణంగా సోమవారం కూడా కాకినాడలో షూటింగ్ క్యాన్సిల్ అయింది. చిల్ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు దేవరకొండ.

Posted in Uncategorized

Latest Updates