విజయ్ మాల్యాకు మరో డెడ్ లైన్

VIJAY MALLYAవిజయ్ మాల్యా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు శనివారం (జూన్-30) మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

లేదంటే పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12 వేల 500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని తెలిపింది న్యాయస్థానం. పెండింగ్‌ లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక‍్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల అన్ని లింక్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్‌ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన PNB స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ, గీతాంజలి జెమ్స్‌ అధిపతి మెహుల్‌ చోక్సీ పై చర్యలకు రెడీ కానుంది ఈడీ.

Posted in Uncategorized

Latest Updates