విజయ్ మాల్యాని దొంగ అనకండి: గడ్కరీ

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగొట్టిన విజయ్ మాల్యా పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్లు చేశారు. మాల్యా దాదాపు 40 ఏళ్ల పాటు దేశంలో ట్యాక్స్ కడుతూ వస్తున్నారని.. కేవలం ఒక్కసారి లోన్ కట్టనంత మాత్రాన ఆయన్నుదొంగ అనడం కరెక్ట్ కాదని గడ్కరీ అన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ మీడియా ఛానల్ ఇంటర్వూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. వ్యాపారంలో ఒడిదుడుకులన్నవి చాలా కామన్ గా జరుగుతాయని.. విమానయాన రంగంలో కి ఎంటర్ అయ్యాకే మాల్యా ఆర్ధికంగా నష్టపోయారని గడ్కరీ చెప్పారు.

ఇలాంటి సమయంలో ఆయనకు అండగా నిలవాలే తప్ప విమర్శలు చేయకూడదని తెలిపారు. ఆర్ధిక మోసాలు నిజమైతే వారిని జైలుకు పంపాలి.. అంతే కానీ ఆయన్ను దొంగ అనే హక్కు మనకు లేదని గడ్కరీ అన్నారు. 40 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సికోమ్.. మాల్యాకు లోన్ ఇచ్చిందని.. ఆ సంస్థకు ఆయన టైం టు టైం డబ్బు చెల్లించేవారని తెలిపారు. రాజకీయ జీవితంలో గానీ, వ్యాపారంలో గానీ ఓడిపోతే అక్కడితో వారి జీవితం ముగిసిపోదని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates