విజయ్ మాల్యా మళ్లీ పెళ్లి

VijayMallya Pinky Lalwaniభారతీయ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు కుచ్చుటోపీ పెట్టి, బ్రిటన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎయిర్‌ హోస్టెస్‌ పింకీ లాల్వాణీని పెళ్లి చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియా ప్రచురించింది. పింకీ లల్వాణీ, విజయ్‌ మాల్యాకు 2011లో పరిచయం అయ్యింది. అనంతరం మాల్యా ఆమెకు తన ఎయిర్‌లైన్స్‌ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం కల్పించారు.

కాల క్రమేణా వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. అంతే కాదు వీరిద్దరు పలు కార్యక్రమాల్లో జంటగానే కనిపించేవారు.  మాల్యాకు ఎయిర్‌హోస్టెతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఆయన మొదటి భార్య సమీరా త్యాబ్జీ సైతం ఎయిర్‌ హోస్టెస్‌. 1986లో సమీరాను వివాహామాడిన మాల్యా, 1993లో రేఖను పెళ్లి చేసుకున్నారు. వీరికి  ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో కుమారుడు సిద్దార్థ్‌, కుమార్తెలు లెన్నా, తాన్యాలు. వేలకోట్లు ఎగొట్టి పారిపోయిన మాల్యా లండన్‌లో విలాసవంమైన జీవితం గడుపుతున్నాడు.

Posted in Uncategorized

Latest Updates