విజువల్ వండర్.. అంతరిక్షం టీజర్

సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అంతరిక్షం. అదితి రావు హారోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీకి ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. దసరా కానుకగా (అక్టోబర్-17)న టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ అభిమానులలో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. గౌతమీపుత్ర శాతకర్ణితో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఘాజీ సినిమాలానే ఈ మూవీ భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

Posted in Uncategorized

Latest Updates