విజేత: మెగా అల్లుడి టీజర్ రిలీజ్

VIJETHAమెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత. ఇటీవ‌ల  సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. మామయ్య నటించిన సినిమా టైటిలే అల్లుడి సినిమాకు పెట్టడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ముర‌ళీ శ‌ర్మ హీరో తండ్రి పాత్ర‌ పోషించ‌గా…తండ్రి కొడుకుల మ‌ధ్య సాగే చిత్రంగా విజేత ఉంటుంద‌ని స‌మాచారం. రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న విజేత చిత్రం తాజాగా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేసి జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాలేజ్ కథాంశంగా కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాహుబలి” చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. “రంగస్థలం” చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే చిత్ర ఆడియో వేడుక నిర్వ‌హించ‌నున్నారు.

Posted in Uncategorized

Latest Updates