విడాకులకు అప్లై చేసిన రాకుమారి

జైపూర్ : ఆమె కోటలోని మహారాణి. తరతరాలు కూర్చుని తిన్నా ..తరగని ఆస్తి. రాజకీయంగాను రాణించింది. అయితే.. పెళ్లై 21 సంవత్సరాలు గడిచాక సంచలన నిర్ణయం తీసుకుంది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినప్పటికీ.. తనకు భర్త నచ్చడంలేదని విడాకులకు అప్లై చేసింది.  వివరాల్లోకెళితే..జైపూర్‌ రాజకుమారి, సవాయి మాధోపూర్‌ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేశారు. హిందూ వివాహ చట్టం 13బీ సెక్షన్‌ కింద గాంధీనగర్‌ ఫ్యామిలీ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్‌ దాఖలు చేశారు.

పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు దరఖాస్తులో తెలిపారు.  జైపూర్‌ మహారాజు భవానీ సింగ్‌ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ అనే రాజును.. 1997లో వివాహం చేసుకుంది.  వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.  21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనుంది.

Posted in Uncategorized

Latest Updates