విడుదలైన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్

rajaరాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం(ఫిబ్రవరి23) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 2 తో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. దేశంలోని 16 రాష్ట్రాలలోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణలో 3 స్థానాలు, ఎపీ 3, బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  మార్చి 5న నోటిఫికేషన్ వెలువడనుంది.
నామినేషన్ల దాఖలుకు మార్చి 12 చివరి తేది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 15. మార్చి 23 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates