విత్తనాలు, ఎరువులకు డిమాండ్ : రైతుల చేతుల్లో రూ.5వేల కోట్లు

farmers-rythu-bandhuవెయ్యి కాదు.. లక్షలు కాదు.. అక్షరాల రూ.5వేల 100కోట్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని రైతుల చేతుల్లో ఉన్న డబ్బు ఇది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారు రైతులు. ఇప్పటి వరకు 40 లక్షల మంది రైతులు.. బ్యాంకుల నుంచి రూ.5,100 కోట్లు డ్రా చేసుకున్నారు. మరో 4 లక్షల మంది రైతులు.. రూ.600 కోట్ల వరకు డ్రా చేసుకోవాల్సి ఉంది. రైతు బంధు పథకం కింద ఆర్బీఐతో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం.. మొత్తం 5వేల 700 కోట్లు బ్యాంకుల్లో సిద్ధం చేసింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకులు రైతులకు నగదు అందించాయి.

విత్తనాలు, ఎరువులకు భారీ డిమాండ్ :

ఒక్కో రైతు దగ్గర.. ఎకరాకి రూ.4వేల చొప్పున డబ్బు సిద్ధంగా ఉంది. నాలుగు ఎకరాలు ఉంటే.. 16వేలు డబ్బు. ఇలా వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు డబ్బు రెడీగా ఉండటంతో.. వ్యవసాయ పనులపైనా దృష్టి పెట్టారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకి అడ్వాన్స్ ఇస్తున్నారు. చేతిలో డబ్బు ఉంటే ఖర్చయిపోతాయి అనే ఉద్దేశంతో ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. దీంతో విత్తనాలు, ఎరువులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే 2.5లక్షల క్వింటాళ్ల విత్తనాలును ఆయా జిల్లాలకు పంపించింది. ఈ ఖరీఫ్ సీజిన్ లో 7లక్షల టన్నుల విత్తనాలు అవసరం అని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బయోమెట్రిక్ ద్వారా ఎరువుల విక్రయాలు

తెలంగాణ వ్యాప్తంగా 3వేల ఎరువుల దుకాణాలు ఉన్నాయి. బయోమెట్రిక్ ద్వారా విక్రయాలు చేయాలని కేంద్ర ఆదేశాలతో.. 2వేల 800 షాపులకు ఈ-పోస్ మెషీన్స్ సరఫరా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సరిగా సిగ్నల్స్ లేకపోవటం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చేతిలో డబ్బులు ఉండటంతో ఎరువులకు కూడా అడ్వాన్స్ కట్టేస్తున్నారు రైతులు.

 

Posted in Uncategorized

Latest Updates