విదేశాల్లో MBBS : నీట్ తప్పని సరి

NEET-ABRODమెడికల్ విద్యను చదవాలంటే నేషనల్ ఎలిజబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.ఇప్పటి వరకు ఇది విదేశాల్లో మెడికల్ కోర్సు చదువుకునే విద్యార్ధులకు ఈ నిబంధన లేదు. అయితే ఇకపై విదేశీ వర్శిటీలో MBBS చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఇకపై నీట్ లో ఉత్తీర్ణత సాధించడం తప్పని సరి కానుంది. అన్ని విధాల అర్హులైన స్టూడెంట్లే విదేశాలకు వెళ్లొచ్చేలా చూడడానికి ఇది అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మెడికల్ కోర్స్ చదువాలంటే నీట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. విదేశాలకు వెళ్లేవారికీ దీనిని విస్తరించే ఆలోచన దాదాపు ఒకే అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి.. తిరిగి భారత్‌కు వచ్చేవారిలో సగటున 12-15% మంది మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియ (MCI) నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్క్రీనింగ్  ఎగ్జామ్ (FMGE) లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అ అయిదేళ్లలో ఎప్పుడూ 26.9% మించి ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం దీనికి కారణమేమీ కాదని ఒక కమిటీ తేల్చిచెప్పింది. ఈ ఉత్తీర్ణత సాధించకపోతే భారత్‌లో వైద్యవృత్తిని చేపట్టడానికి వారి పేర్లు నమోదు చేసుకునే వీలుండదు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కానివారు అక్రమ పద్ధతుల్లో వైద్యం చేస్తుంటారు. దీంతో కేవలం సమర్థులైన విద్యార్థులే విదేశీ వర్శిటీలకు వెళ్లేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని వివరించారు.

విదేశాల్లో ప్రతీ ఏటా సుమారు 7,000 మంది విద్యార్థులు విదేశాల్లో MBBS చదివేందుకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చైనా, రష్యాలను ఎంచుకుంటున్నారు. విదేశాల్లో చదువుకు పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నవారు తిరిగి మాతృదేశానికి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిరక్షణ రంగానికి తమ వంతు సహకారాన్ని అందించలేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇకపై విదేశాల్లో చదవాలనుకునేవారు నీట్‌లో ఉత్తీర్ణులైతేనే ప్రభుత్వం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇస్తుంది.

Posted in Uncategorized

Latest Updates