విదేశీ పర్యటనలో రాష్ట్రపతి దంపతులు

KOVINDమూడు దేశాల పర్యటనకు బయల్దేరారు ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్. గ్రీస్, సురినామ్, క్యూబాలో పర్యటించేందుకు గాను ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. 9 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి విష్ణు దేశాయ్, మరికొంతమంది ప్రముఖులు వెళ్లారు. గ్రీస్ ప్రెసిడెంట్ ప్రొకొపిక్ పావ్ పోస్లో, సురినామ్ అధ్యక్షుడు దిసెరె డెలానో, క్యూబా ప్రెసిడెంట్ మిగ్యుయెల్ డియాజ్ తో భేటీ అవుతారు.

పర్యటన సంధర్భంగా మూడు దేశాలతో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై సంతకాలు చేసే అవకాశముంది. టూర్ కు బయల్దేరే ముందు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు కోవింద్. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates