విద్యార్థులందరికీ టీశాట్ ద్వారా టెక్నాలజీ క్లాసులు : కేటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ క్లాస్ లను అందించడంలో టీశాట్ ఎంతో ఉపయోగపడిందన్నారు మంత్రి కేటీఆర్. గురువారం (జూలై-26) హైదరాబాద్ అంబేద్కర్ వర్సిటీలో ఏర్పాటుచేసిన టీశాట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడారు కేటీఆర్. తెలంగాణ నలుమూలలా ఉన్న విద్యార్థులకు టీశాట్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పాఠాలను ప్రసారం చేస్తున్నారన్నారు.

మధ్య తరగతి విద్యార్థులకు టీశాట్ టెక్నాలజీ విద్యను అందిస్తోందన్నారు. టీశాట్ విద్య వరకే కాకుండా వ్యవసాయ రంగానికీ ఉపయోగపడాలని చెప్పారు. పోటీ పరీక్షలు వచ్చాయంటే టీశాట్ లో షెడ్యూల్ వివరాలను ప్రసారం చేస్తున్నారని తెలిపారు.  మారుమూల విద్యార్థులకు లాభం చేకూరేలా  టీశాట్ అభివృద్ధికి  కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మనవాళ్లు ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఉండాలన్న కేటీఆర్..తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు టీశాట్ ద్వారా టెక్నాలజీ బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎడ్యుకేషనల్ డిపార్ట్ మెంట్ నుంచి పూర్తి సహకారం ఉండాలన్నారు. కార్యక్రమానికి ముందు కేటీఆర్ యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates