విద్యార్థులకు మోడీ పిలుపు : విశ్వాసంతోనే ఉన్నత స్థాయికి

modistudentsదేశంలో మార్పు విద్యార్థులతోనే సాధ్యమన్నారు ప్రధాని మోడీ.  శుక్రవారం (ఫిబ్రవరి-16) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని..  విద్యార్థులతో చర్చా గోష్టి నిర్వహించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడంపై మోడీ సూచనలు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసం పెరగాలన్నారు.

తాను నిరంతరం విద్యార్థినేనన్న ఆయన.. ఈ రోజు తనకు పరీక్ష అన్నారు. ఈ పరీక్షలో పది మార్కులకు మీరు ఎన్ని మార్కులు వేస్తారని విద్యార్థులను చమత్కారంగా ప్రశ్నించారు మోడీ. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శ్రమలో లోపం ఉండదన్నారు. పాఠ్యాంశాలు తరచూ విద్యార్థుల మదిలో మెదులుతూనే ఉంటాయని గుర్తు చేశారు. దేవతలను పూజించాలని విద్యార్థులకు పెద్దలు సూచిస్తారు. అయితే ఆత్మవిశ్వాసం లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఆత్మ విశ్వాసంతో కఠిన పరీక్షల్లోనూ విజయం సాధించవచ్చు అని సూచించారు. ఏదైనా పని చేస్తానని పూనుకుంటే.. సాధించే వరకు వదిలిపెట్టొద్దని విద్యార్థులకు చెప్పారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates