విద్యార్థులకు స్పెషల్: మిలటరీ టూర్

school-childran-army-trainningప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, దేశ భక్తిని  పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మిలటరీ శిక్షణ కేంద్రాల్లో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మిలటరీ శిక్షణ, ప్రాధాన్యం, సైన్యం ఎదుర్కొనే సమస్యలు, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు. కొద్ది రోజులుగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు(KGBV), ఆదర్శ,జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన 8,9 వ తరగతి విద్యార్థులు కంటోన్మెంట్ లోని సైనిక శిక్షణను చూశారు. మొత్తం 300 స్కూళ్లకు చెందిన 15 వేల మంది విద్యార్ధులకు అవకాశం లభించనుంది.  ఇప్పటికే 20 ప్రభుత్వ పాఠశాలల చెందిన వెయ్యి మంది విద్యార్థులకు మిలటరీ టూర్‌ ను సందర్శించారు. మిలటరీ ట్రైనింగ్ తో పాటు..సైనికులు యుద్ధం సమయాల్లో వినియోగించే ఆయుధాల గురించి కూడా అధికారులు విద్యార్థులకు వివరిస్తున్నారు. స్వయంగా చూడటంతో రక్షణ దళాల్లో పని చేసేందుకు భవిష్యత్తులో విద్యార్థులు ఇంట్రెస్టు చూపించే అవకాశముందంటున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates