విద్యార్థుల భద్రత కోసం.. విద్యాశాఖ స్పెషల్ యాప్

APPసర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల కోసం అనేక సధుపాయాలను కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..లేటెస్ట్ గా మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే విద్యార్థుల కోసం బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం స్పెషల్ యాప్ ను రూపొందించింది.

పాఠశాలల్లోని మౌలిక వసతులు, మరుగుదొడ్ల నిర్వహణ, స్కూల్ విజిట్, హరితహారం, నేషనల్ ఎచీవ్‌ మెంట్ సర్వే, స్కూల్ మ్యాపింగ్ వంటి పలురకాల కార్యక్రమాలను యాప్ ద్వారా పర్యవేక్షించనున్నారు అధికారులు. అందుకోసం స్కూళ్ల వారీగా డిజిటల్ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. మొబైల్ యాప్ వల్ల పాఠశాలల పని సామర్థ్యం పెరుగుతుంది. స్కూళ్లకు భద్రత ఉంటుంది. నిర్వహణ తేలికవుతుంది. విద్యాభివృద్ధి పథకాల పర్యవేక్షణ సులువవుతుందని తెలిపారు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీహరి.

Posted in Uncategorized

Latest Updates