విద్యార్ధుల పాలిట శాపం : ఆ స్కూల్ కి మాత్రం వెళ్లలేమంటున్న టీచర్లు

పరిశ్రమల  కాలుష్యం  ఆ ప్రభుత్వ  పాఠశాల  విద్యార్థుల పాలిట  శాపంగా మారింది.  భవిష్యత్ ను  అంధకారంలోకి  నెట్టేస్తుంది.  టీచర్లంతా   ఉండలేమంటూ  ట్రాన్స్ ఫర్ లు  చేయించుకుంటే.. పిల్లలు బడికి పోమంటూ  మారాం  చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం బోరుపట్లలోని పాఠశాలలో పని చేసేందుకు ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఫార్మా కంపెనీలు ఉండటంతో .. విష రసాయనాల వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్కూల్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ముక్కుకు కర్చిఫ్ లేకుండా ఉండలేని పరిస్థితి.

పాఠశాలలో ప్రస్తుతం 300 మంది విధ్యార్థులు, 16 మంది టీచర్లు ఉన్నారు. ఇక్కడి పొల్యూషన్ తో అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు టీచర్లు. చాలా మంది పిల్లలు వాంతులు చేసుకోవడం.. ఇక్కడ కామన్ గా మారింది. దీంతో పిల్లల హాజరు శాతం కూడా తగ్గిపోతోందంటున్నారు.  అనారోగ్యానికి గురయ్యే విద్యార్థుల కోసం స్కూళ్లోనే మెడిసిన్ కిట్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు.

అనారోగ్య సమస్యలు వస్తుండటంతో.. టీచర్ల ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపటంలేదు. దీంతో విద్యార్ధుల చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడికి వచ్చేందుకు ఏ టీచర్ ఇష్టపడకపోవడంతో.. విద్యార్ధుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్ పై ఎఫెక్ట్ చూపిస్తున్న ఫార్మా కంపెనీలను దూరంగా తరలించాలని కోరుతున్నారు స్థానికులు.

 

Posted in Uncategorized

Latest Updates