విద్యావ్యవస్థ బలంగా ఉంటేనే దేశాభివృద్ది సాధ్యం : ఆర్బీఐ మాజీ గవర్నర్

విద్యావ్యవస్థ బలంగా ఉంటేనే దేశాభివృద్ది సాధ్యమన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్, ఇక్ఫాయ్ యూనివర్సిటీ చాన్స్ లర్ రంగరాజన్. ఇక్ఫాయ్ యూనివర్సిటీ 9వ ఫౌండేషన్ డే సందర్భంగా..దేశాభివృద్ధిలో విద్యావ్యవస్థ అనే అంశంపై ఫౌండేషన్ డే లెక్చర్ నిర్వహించారు. ఇండియా.. యూత్ ఎక్కువగా ఉన్న దేశమన్నారు. రానున్న రోజుల్లో దేశంలో పనిచేసేవారి సంఖ్య పెరిగి మరింత బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Latest Updates