విద్యా కేలండర్: దసరా, సంక్రాంత్రి సెలవుల్లో మార్పు

school-calendarన్యూ అకాడమిక్ ఇయర్ కేలండర్ ను  విద్యాశాఖ ప్రకటించింది. జూన్‌ 1నే  స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం బుధవారం(మే-23) 2018-19 విద్యా కేలండర్‌ను ప్రకటించింది. 2019 ఏప్రిల్‌ 12 వరకు స్కూళ్లు ఉంటాయి. ఏప్రిల్‌ 13 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించారు అధికారులు. జనవరి 10కల్లా పదో తరగతి సిలబస్‌ పూర్తి చేసి విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయించాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్ మెంట్(FA), సమ్మేటివ్‌ అసెస్ మెంట్(SA) పరీక్షల షెడ్యూల్‌నూ ప్రకటించారు. ఎస్‌ఏ-1 పరీక్షలను 2018 అక్టోబరు 1-8 వరకు, ఎస్‌ఏ-2 పరీక్షలను 2019 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. 1 నుంచి 9 తరగతులకు 2019 ఫిబ్రవరి 28వ తేదీకల్లా పాఠ్యప్రణాళిక పూర్తి చేస్తారు.పాఠశాల స్థాయి, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ఆగస్టు, సెప్టెంబరుల్లో నిర్వహించనున్నారు.

కొత్త విద్యా సంవత్సరంలో  పండుగలకు పాఠశాలల సెలవులను నిర్ణయించారు. గత ఏడాది వరకు దసరా సెలవులు 15 రోజులుండగా ఈ సారి వాటిన 13 రోజులకు కుదించారు. అలాగే సంక్రాంతి సెలవులను 5 రోజుల నుంచి 7 రోజులకు పెంచారు. అక్టోబరు 9-21 వరకు (13రోజులు) దసరా సెలవులను ప్రకటించారు. మిషనరీ స్కూళ్లకు డిసెంబరు 23-29 వరకు క్రిస్మస్‌ సెలవులు ప్రటించారు. 2019 జనవరి 11-17 వరకు (ఏడు రోజులు) సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ప్రాథమికోన్నత పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 9:00 నుంచి 4:15 గంటల వరకు కొనసాగుతాయి.

Posted in Uncategorized

Latest Updates