విద్యుత్తు స్తంభానికి ఢీకొన్న కారు : ముగ్గురు మృతి


కొండమల్లేపల్లి : అదుపుతప్పిన కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొలుముంతల్‌ పహాడ్‌ పంచాయతీ పరిధిలోని కేశ్యతండాలో నిన్న(బుధవారం) జరిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. వీరు హైదరాబాద్‌లో నివసిస్తున్న పోల్కంపల్లి గ్రామస్థులను ఓటు వేయడానికి రావాలని చెప్పి… సురేందర్‌రెడ్డి స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, ఆయన అల్లుడు తిప్పన వెంకట్‌రెడ్డి, అన్న కుమారుడు మహేందర్‌రెడ్డితో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కేశ్యతండా వద్ద విద్యుత్తు స్తంభానికి కారు ఢీకొనడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి మార్గమధ్యంలో మరణించారు. మహేందర్‌రెడ్డి, నర్సింహాచారి తీవ్రంగా గాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates