విద్యుత్ ఉద్యోగుల కృషితో కరెంట్ కష్టాలు తీరాయి : నరసింహన్

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో కరెంట్ కష్టాలు లేవన్నారు గవర్నర్ నరసింహన్. డిసెంబర్-20న తెలంగాణ ఇంజినీర్స్ భవన్ లో జరిగిన రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యారు గవర్నర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సీఎం చొరవతో రాష్ట్రం ఏర్పడిన కొన్నాళ్లకే విద్యుత్ సమస్య అధిగమించామని చెప్పారు. అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్న గవర్నర్..  సోలార్ పవర్ వినియోగం పెరగాలన్నారు. విద్యుత్ కొనుగోలుపై ఆధారపడకుండా.. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలన్నారు. వ్యవసాయ రంగంలో సోలార్ పవర్ ను ప్రోత్సహించాలి చెప్పారు. రాజ్ భవన్ లో వందశాతం సోలార్ పవర్ వాడుతున్నామని.. వచ్చే ఏడాది వరకు ఇంజినీర్స్ బిల్డింగ్ ను సోలార్ ఎనర్జీ బిల్డింగ్ గా మార్చాలని సూచించారు నరసింహన్.

Posted in Uncategorized

Latest Updates