విద్యుత్ శాఖలో 2,553 JLM ఉద్యోగాలు

electric-poleతెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్  ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM)

సాలరీ: రూ.15,585-రూ.25,200

 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, ఖ‌మ్మం-365, నిజామాబాద్-500, ఆదిలాబాద్-439

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఎల‌క్ట్రిక‌ల్/ వైర్‌మ్యాన్ ట్రేడ్ లో ITI/ఎల‌క్ట్రిక‌ల్ కోర్సులో రెండేళ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఏజ్ లిమిట్: 2018, వరకు 18-35 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వయసును..కాంట్రాక్టులో చేరిన నాటి నుంచి లెక్కలోకి తీసుకుంటారు.

ఎంపిక: రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్

రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో 80 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సెక్షన్ A లో 65 ప్రశ్నలు సంబందిత ITI సబ్జెక్టు నుంచి..  సెక్షన్ B లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ & న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ఇన్ సర్వీస్ అవుట్ సోర్స్ అభ్యర్థులకు ఆయా కేటగిరీలను బట్టి గరిష్టంగా 20 మార్కుల వరకు వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి పోల్ క్లైంబింగ్ నిర్వహించి తర్వాత..తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:  ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.100. ఎగ్జామినేష‌న్ ఫీజుగా రూ.120 చెల్లించాలి.SC,ST,BC అభ్యర్థులు రూ.100 ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు. ఎగ్జామినేష‌న్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ: మార్చి,19, 2018

http://www.tsnpdcl.in/ShowProperty/NP_CM_REPO/Pages/careers/JLM%20Notification-2018

 

Posted in Uncategorized

Latest Updates