విద్యుత్ షాక్ తో భార్యను హతమార్చాడు

భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు  ఓ భర్త. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని భఠాపారా జిల్లాలో జరిగింది. జవాన్ సురేశ్ మిరి(33) ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో పని చేస్తున్నాడు. అయితే తన భార్య లక్ష్మీ(27) మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం కలిగింది సురేశ్. దీంతో నిన్న(బుధవారం-జులై 18) ఇంటికొచ్చాడు సురేశ్. లక్ష్మీ తన నివాసంలో బట్టలు ఉతుకుతుండగా, ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెను దారుణంగా కొట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మీకి ప్రయివేటు పార్ట్స్‌లోకి విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు.

ఆ తర్వాత లక్ష్మీ తల్లిదండ్రులకు సురేశ్ ఫోన్ చేసి, అనారోగ్యంతో లక్ష్మీ మృతి చెందిందని చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన లక్ష్మీ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌ను పోలీసులు ప్రశ్నించగా… తానే లక్ష్మీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సురేశ్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates