విధి వెంటాడింది : ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి

accidentహైదరాబాద్ TCS కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వీకెండ్ కావటంతో.. కుంటాల జలపాతం సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి కారు ఇన్నోవా టైరు పేలడంతో ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు చనిపోయారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారి 61పై ఈ యాక్సిడెంట్ జరిగింది.

హైదరాబాద్ TCS కంపెనీలో పనిచేస్తున్న ఇంజినీర్లు దీపక్, కుసుమ, విద్య, నిఖిత, నవీన్, యుగేంధర్‌ ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం కుంటాల జలపాతానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్. కొండాపూర్ బైపాస్ జాతీయ రహదారిపైకి వచ్చిన కొద్దిసేపటికే.. కారు టైరు పేలిపోయింది. ఆ తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిబ్బలను కారు వేగంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న దినేష్ (27), కుసుమ (26) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇంజనీర్లు శ్రీవిద్య, నిఖిత, నవీన్, యుగేంధర్‌లను నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవిద్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. నిజామాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే సిఐ జీవన్‌రెడ్డి, ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఒకే రోజు ముగ్గురు ఇంజనీర్లు చనిపోవటం, మరో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడటంతో.. TCS కంపెనీలో విషాఛాయలు అలుముకున్నాయి. అందరూ ఒకే బ్యాచ్ కు చెందిన వారు కావటం, అందులోనూ యువకులు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరగటంపై షాక్ కు గురవుతున్నారు. సొంత వాహనాలు ఉన్నా.. సేఫ్టీ అంటూ సెల్ఫ్ డ్రైవింగ్ అద్దె కారు తీసుకున్నారు. డ్రైవింగ్ జాగ్రత్తగానే చేస్తున్నారు. అయినా టైర్ రూపంలో మృత్యువు వెంటాడిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates