విధుల్లో నిర్లక్ష్యం..ఏడుగురు రెవిన్యూ అధికారుల సస్పెన్షన్

Telengana_State_Emblemతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాలనలో పలు మోసాలు జరిగాయని వస్తున్న ఫిర్యాదులపై కఠన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించిన వారిని అభ్యంతరం లేకుండా వేటు వేస్తోంది. ఈ క్రమంలోనే ..భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహారించారంటూ ఏడుగురు రెవెన్యూ అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. విధుల్లో నిర్లక్ష్యం చేశారని వీర్నపల్లి తహసిల్దార్ విజయలలిత, గంభీరావుపేట మండలంలో ముగ్గురు వీఆర్వోలు, ముస్తాబాద్ మండలంలో ఇద్దరు వీఆర్వోలు, వేములవాడ రూరల్ లో ఒక వీఆర్వోను సస్పెండ్ చేస్తూ…ఉత్తర్వులిచ్చింది.  ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ… ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్.

Posted in Uncategorized

Latest Updates