వినూత్న నిరసన… ప్రమోషన్ కోసం రోజూ డాక్టర్ల రక్తదానం

సాధారణంగా తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఉద్యోగులు,విద్యార్ధులు, ప్రజలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు. అయితే మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోని జవహర్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(JNIMS) రెసిడెంట్ డాక్టర్లు ప్రమోషన్ల కోసం చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జెఎన్ఐఎంఎస్ లో పనిచేస్తున్న డాక్టర్లు తమ ప్రమోషన్ల కోసం రోజూ మూడు యూనిట్ల బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ బ్లడ్ ను వారు జెఎన్ఐఎంఎస్ బ్లడ్ బ్యాంక్ కు పంపిస్తున్నారు. ఈ నిరసనలో 50 మంది డాక్టర్స్ పాల్గొంటున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకూ ఈ నిరసన ఇలానే కొనసాగిస్తామని డాక్టర్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates