విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు : అమిత్ షా

DaF8fCOUQAEv7BBబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి రెచ్చిపోయారు. విపక్షాలను మనుషులా.. జంతువులా.. అంటూ కడిగి పారేశారు.  విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (ఏప్రిల్-6) ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే.. విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని తెలిపారు. ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని, ప్రధాని మోడీ ఇదివరకు సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని తెలిపారు అమిత్ షా. 2019 ఎన్నికల తర్వాత ఎవరిసత్తా ఏంటో తెలుస్తుందని, ఇకనైనా మేల్కోవాలంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలను ప్రధాని మోడీ చాలా సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా, విపక్షాలు మాత్రం సభ సమయాన్ని వృథా చేశాయన్నారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates